jump to navigation

తెలంగాన తెలుగు జూన్ 20, 2007

Posted by ~Sri~ in Telangana.
1 comment so far

పోంగచిక్కినోడు

తెలంగాణా గ్రామీణ ప్రాంతాల్లో వినిపించే జాతీయమిది. మొండివాడు ఎవరికీ తల వంచనివాడు లాంటి అర్థాలలో ఇది ప్రయోగంలో కనిపిస్తుంది. ఇది పూర్వకాల సామాజిక పరిస్థితుల నేపథ్యం నుంచి అందులోనూ మసూచి, కలరా వంటి భయంకర వ్యాధులు సోకినప్పుటి సమయాల నేపథ్యంలో నుంచి ఆవిర్భవించింది. అలాంటి వ్యాధులు వ్యాపించినప్పుడు పూర్వం గ్రామాల్లో చాలామంది మరణిస్తూ ఉండేవారు. కొంతమంది పొరుగు గ్రామాల్లోని తమ బంధువుల దగ్గరకు వెళ్ళిపోయేవారు. కానీ ఏ ఒక్కరో, ఇద్దరో ఆ గ్రామాన్ని విడిచి పెట్టకుండా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఉండి బతికి బయటపడేవారు. రోగాల కారణంగా గ్రామం అంతా ఖాళీ అయిపోతే మిగిలిన ఆ ఒక్కడే గ్రామానికి తిరుగులేని పెద్దగా ఆ తరువాత ఉంటూ ఉండేవాడు. అలాగే ఎవరైనా మొండి చేసి పరిస్థితులను ఎదుర్కొని నిలబడిన సందర్భంలో ”వాడు పోంగచిక్కినోడు వాడితో మనం గెలవలేం” లాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది. (ఇంకా…)

ఆంద్రా లుంగివాల జూన్ 20, 2007

Posted by ~Sri~ in Telangana.
1 comment so far

*”కాళ్లకు చెప్పుల్లేకుండా లుంగీలతో హైద్రాబాద్‌కు వచ్చిన ఆంధ్రోళ్లు.. మాకు తిండి తినుడు, కట్టుబాట్లు నేర్పినమంటుండ్రు! ఎలిజబెత్‌ రాణికే ఆతిథ్యమిచ్చిన చరిత్రమాది. షేర్వాణీ, బిర్యానీ, ఖుర్బానీ.. ఇట్ల దర్జాగ బతికినం మేం. చేగొండి, వసంత నాగేశ్వరరావు, ఏపీ ఎన్జీవో సంఘం అనవసరంగా నోరు పారేసుకోవద్దు”

*”610 జీవో అమలుకు వైఎస్‌ను డెడ్‌లైన్‌ పెట్టమన్నోడెవడు? జూన్‌ 30లోగా అమలు చేస్తనంటూ ఉత్తర ప్రగల్భాలు కొట్టిండు. మీడియాకు చెప్పుకున్నడు. ఇప్పుడు మాటపై నిలబడి అమలు చేయాలె”

*‘ఇత్నీ హసీ ఆతీ హై
ముఝ్‌కో హజ్రతే ఇన్‌సాన్‌ పర్‌
కరే బద్‌తో ఖుద్‌ కరే
లానత్‌ కరే సైతాన్‌ పర్‌’
(చేయాల్సిన తప్పులన్నీ చేసి, దెయ్యం చేయించిందంటూ తప్పించుకునేటోళ్లను చూస్తే నవ్వొస్తది)”
- కేసీఆర్‌ (ఇంకా…)

ఆంధ్రా ఉద్యోగులకు కౌన్సిలింగ్‌ – పాగల్ లొగొకొ కౌన్సిలింగ్‌ దేనాపడెగ జూన్ 19, 2007

Posted by ~Sri~ in Telangana.
add a comment

      ”నిర్ణీత కోటాకు మించి హైదరాబాద్‌లో ఉన్న కోస్తా, రాయలసీమ ఉద్యోగులను సొంత జిల్లాలకు పంపొద్దు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో వీరిని నియమిస్తే అక్కడి నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. సూపర్‌ న్యూమరరీ పోస్టులు సృష్టించి వీరందరినీ హైదరాబాద్‌లోనే ఉంచాలి. 610 జీవోపై జరిగే చర్చల్లో జనాభా ప్రాతిపదికన మూడింట రెండొంతుల మంది కోస్తా, రాయలసీమ ప్రతినిధులు ఉండాలి. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకే దీనిని అమలు చేయాలి. ఈ డిమాండ్లకు మద్దతుగా ఈనెల 25 నుంచి కోస్తా, సీమ జిల్లాల్లోని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తాం. కలెక్టర్లకు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతి పత్రాలు సమర్పిస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి మా ఆందోళనను తెలియజేస్తాం” అని ఏపీ ఎన్జీవో సంఘం నాయకులు ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లో సమావేశమై 610 జీవో అమలుపై చర్చించారు. ఈ సమావేశానికి సంఘం అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి అధ్యక్షత వహించగా.. ఇందు లో కాంగ్రెస్‌ నేతలు చేగొండి హరిరామజోగయ్య, వసంత నాగేశ్వరరావు, టీజీ వెంకటేష్‌, చదలవాడ కృష్ణమూర్తి, భాజపా నాయకుడు పార్థసారథి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రోశయ్య, వివిధ సంఘాల నేతలు కూడా పాల్గొన్నారు. సమావేశంతర్వాత విలేకరులతో మాట్లాడారు
(ఇంకా…)

చంద్రబాబు “ఊద్‌” ముబారక్‌ జూన్ 19, 2007

Posted by ~Sri~ in Telangana.
add a comment

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, ముఖ్యమంత్రి పదవిని దళితుడికి, ఉప ముఖ్యమంత్రి పదవిని ముస్లింకు ఇస్తామని తెరాస అధినేత కేసీఆర్‌ ప్రకటించారు. మంత్రివర్గంలో ఐదారుగురు ముస్లిం వర్గీయులకు అవకాశం కల్పిస్తామన్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌ పాతబస్తీ కిషన్‌బాగ్‌లో తెరాస కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ముస్లింలు అధిక సంఖ్యలో హాజరైన ఈ సభలో కేసీఆర్‌ ఉర్దూలో మాట్లాడారు.

(ఇంకా…)