jump to navigation

తెలంగాణాకు మొదటి ముఖ్యమంత్రి దళితుడే ః కెసిఆర్‌ ఏప్రియల్ 15, 2008

Posted by ~Sri~ in Telangana.
trackback

నల్లగొండ, (భువనగిరి) ఏప్రిల్‌ 15 ః తెలంగాణ రాష్ట్రం వస్తే మొదటి ముఖ్యమంత్రి దళితుడే అని టి ఆర్‌ ఎస్‌ అధినేత కె. చంద్రశేఖరరావు పేర్కొన్నారు. సోమవారం రాత్రి యాదగిరిగుట్ట మండలం మోటకొండూరు గ్రామంలో అంబేద్కర్‌ జయంతి ఉత్సవాల్లో కెసిఆర్‌ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణా రాష్ట్ర సాధనకు అంబేద్కర్‌ స్ఫూర్తిగా పోరాటం సాగిస్తామని కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. తెలంగాణా రాష్ట్రాన్ని కోరుకున్న మొదటి వ్యక్తి అంబేద్కర్‌ అని పేర్కొన్నారు.

దళిత ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రతి కుటుంబానికి మూడెకరాల వ్యవసాయ భూమితోపాటు సాగునీటి వసతిని కల్పిస్తామన్నారు.ఎస్‌టిలకు, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్‌తోపాటు బిసిలకు 45 శాతం చట్టసభల్లో రిజర్వేషన్‌ను కల్పిస్తామన్నారు. దేశంలోనే తెలంగాణా రాష్ట్రాన్ని ఆదర్శంగా తీరిదిద్దుతామన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటైతే మరో ఛత్తీస్‌గఢ్‌ అవుతుందని ప్రచారం చేయటం సమంజసం కాదని అన్నారు. 2004 ఎన్నికల ఎజెండాలో నక్సల్స్‌తో చర్చలు జరుపుతామని ప్రకటించారు. అనంతరం నెత్తురు రుచిమరిగిన పులిలా రక్తం పారిస్తున్నారని అన్నారు. నక్సలిజానికి శాంతియుత మార్గమే పరిష్కారమని చెప్పారు. ప్రజాసంఘాల నోరు నొక్కుతూ సామాజికఎజెండాను లేకుండా చేస్తున్నారని అ న్నారు. అంబేద్కర్‌ ఆలోచనలను అమలు చేస్తే నక్సలిజం వచ్చేది కాదని చెప్పారు.

వ్యాఖ్యలు»

No comments yet — be the first.