తెలుగుదేశం పిల్లిమొగ్గలు – కొత్తపల్లి జయశంకర్ జూన్ 19, 2008
Posted by ~Sri~ in Telangana.add a comment
తెలంగాణపై తెలుగుదేశం వేస్తున్న పిల్లిమొగ్గల పరంపరలో కోర్ కమిటీ నియామకంతో మరో ప్రహసనం మొదలయింది. 2004 సార్వత్రిక ఎన్ని కలలో సమైక్యాంధ్ర నినాదమే తన ప్రధాన అజెండాగా ప్రకటించి, చావు దెబ్బ తిన్న తరువాత తెలుగుదేశం పార్టీ మాట మార్చింది. సరైన సమయంలో సరి యైన నిర్ణయం తీసుకుంటామని కొత్త పల్లవి అందుకున్నది. అదిప్పుడు ఒక అరిగి పోయిన రికార్డు. ఇంతలో ఉప ఎన్నికలు వచ్చాయి. మాట మళ్లీ మార్చి, ఆ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని నమ్మ బలికింది. (ఇంకా…)
జై తెలంగాణ అనకుంటే ‘స్టార్’ మారదు ఏప్రియల్ 15, 2008
Posted by ~Sri~ in Telangana.add a comment
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ఆన్‌లైన్): రాష్ట్ర రాజకీయాల్లోకి తారలు, సితారలు దిగివచ్చినా ఫలితం ఏమీ ఉండదని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. గ్లామర్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానించడం ఆయా పార్టీల్లో నెలకొన్న నిరాశావహ పరిస్థితికి సూచిక అని ఆయన అన్నారు. జై తెలంగాణ అంటే తప్ప వచ్చే ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకైనా ఓట్లు రాలవని స్పష్టంచేశారు. సోమవారం సాయంత్రం నల్లగొండ జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని వర్టూరు (మూటకొండూరు) దళిత వాడలో నిద్ర చేయడానికి బయలుదేరే ముందు తెలంగాణ భవన్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడారు.
తెలంగాణ పట్ల ద్రోహపూరిత వైఖరి అనుసరిస్తున్న కాంగ్రెస్, టీడీపీలకు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో సింగిల్ డిజిట్ సీట్లు మాత్రమే వస్తాయని కేసీఆర్ జోస్యం చెప్పారు. “ముఖ్యమంత్రి వైఎస్ ఇంటింటా సౌభాగ్యం అని చెబుతున్నాడు. కానీ వాస్తవంగా ఇంటింటా దౌర్భాగ్యం కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లోని పరిస్థితి చూసి నేనే మానసికంగా కుంగిపోయాను. ఆడపిల్లలను అమ్ముకునే దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా?” అని ఆయన ప్రశ్నించారు. క్షేత్రస్థాయి పరిస్థితి తెలుసుకోవడానికే తండాలు, దళితవాడల్లో నిద్ర చేస్తున్నామని చెప్పారు.
తెలంగాణాకు మొదటి ముఖ్యమంత్రి దళితుడే ః కెసిఆర్ ఏప్రియల్ 15, 2008
Posted by ~Sri~ in Telangana.add a comment
నల్లగొండ, (భువనగిరి) ఏప్రిల్ 15 ః తెలంగాణ రాష్ట్రం వస్తే మొదటి ముఖ్యమంత్రి దళితుడే అని టి ఆర్ ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావు పేర్కొన్నారు. సోమవారం రాత్రి యాదగిరిగుట్ట మండలం మోటకొండూరు గ్రామంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో కెసిఆర్ పాల్గొని ప్రసంగించారు. తెలంగాణా రాష్ట్ర సాధనకు అంబేద్కర్ స్ఫూర్తిగా పోరాటం సాగిస్తామని కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. తెలంగాణా రాష్ట్రాన్ని కోరుకున్న మొదటి వ్యక్తి అంబేద్కర్ అని పేర్కొన్నారు.
దళిత ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రతి కుటుంబానికి మూడెకరాల వ్యవసాయ భూమితోపాటు సాగునీటి వసతిని కల్పిస్తామన్నారు.ఎస్‌టిలకు, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్‌తోపాటు బిసిలకు 45 శాతం చట్టసభల్లో రిజర్వేషన్‌ను కల్పిస్తామన్నారు. దేశంలోనే తెలంగాణా రాష్ట్రాన్ని ఆదర్శంగా తీరిదిద్దుతామన్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటైతే మరో ఛత్తీస్‌గఢ్ అవుతుందని ప్రచారం చేయటం సమంజసం కాదని అన్నారు. 2004 ఎన్నికల ఎజెండాలో నక్సల్స్‌తో చర్చలు జరుపుతామని ప్రకటించారు. అనంతరం నెత్తురు రుచిమరిగిన పులిలా రక్తం పారిస్తున్నారని అన్నారు. నక్సలిజానికి శాంతియుత మార్గమే పరిష్కారమని చెప్పారు. ప్రజాసంఘాల నోరు నొక్కుతూ సామాజికఎజెండాను లేకుండా చేస్తున్నారని అ న్నారు. అంబేద్కర్ ఆలోచనలను అమలు చేస్తే నక్సలిజం వచ్చేది కాదని చెప్పారు.
తెలంగాన తెలుగు జూన్ 20, 2007
Posted by ~Sri~ in Telangana.1 comment so far
పోంగచిక్కినోడు
తెలంగాణా గ్రామీణ ప్రాంతాల్లో వినిపించే జాతీయమిది. మొండివాడు ఎవరికీ తల వంచనివాడు లాంటి అర్థాలలో ఇది ప్రయోగంలో కనిపిస్తుంది. ఇది పూర్వకాల సామాజిక పరిస్థితుల నేపథ్యం నుంచి అందులోనూ మసూచి, కలరా వంటి భయంకర వ్యాధులు సోకినప్పుటి సమయాల నేపథ్యంలో నుంచి ఆవిర్భవించింది. అలాంటి వ్యాధులు వ్యాపించినప్పుడు పూర్వం గ్రామాల్లో చాలామంది మరణిస్తూ ఉండేవారు. కొంతమంది పొరుగు గ్రామాల్లోని తమ బంధువుల దగ్గరకు వెళ్ళిపోయేవారు. కానీ ఏ ఒక్కరో, ఇద్దరో ఆ గ్రామాన్ని విడిచి పెట్టకుండా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఉండి బతికి బయటపడేవారు. రోగాల కారణంగా గ్రామం అంతా ఖాళీ అయిపోతే మిగిలిన ఆ ఒక్కడే గ్రామానికి తిరుగులేని పెద్దగా ఆ తరువాత ఉంటూ ఉండేవాడు. అలాగే ఎవరైనా మొండి చేసి పరిస్థితులను ఎదుర్కొని నిలబడిన సందర్భంలో ”వాడు పోంగచిక్కినోడు వాడితో మనం గెలవలేం” లాంటి సందర్భాలలో ఈ జాతీయం ప్రయోగం కనిపిస్తుంది. (ఇంకా…)
ఆంద్రా లుంగివాల జూన్ 20, 2007
Posted by ~Sri~ in Telangana.1 comment so far
*”కాళ్లకు చెప్పుల్లేకుండా లుంగీలతో హైద్రాబాద్‌కు వచ్చిన ఆంధ్రోళ్లు.. మాకు తిండి తినుడు, కట్టుబాట్లు నేర్పినమంటుండ్రు! ఎలిజబెత్ రాణికే ఆతిథ్యమిచ్చిన చరిత్రమాది. షేర్వాణీ, బిర్యానీ, ఖుర్బానీ.. ఇట్ల దర్జాగ బతికినం మేం. చేగొండి, వసంత నాగేశ్వరరావు, ఏపీ ఎన్జీవో సంఘం అనవసరంగా నోరు పారేసుకోవద్దు”
*”610 జీవో అమలుకు వైఎస్‌ను డెడ్‌లైన్ పెట్టమన్నోడెవడు? జూన్ 30లోగా అమలు చేస్తనంటూ ఉత్తర ప్రగల్భాలు కొట్టిండు. మీడియాకు చెప్పుకున్నడు. ఇప్పుడు మాటపై నిలబడి అమలు చేయాలె”
*‘ఇత్నీ హసీ ఆతీ హై
ముఝ్‌కో హజ్రతే ఇన్‌సాన్ పర్
కరే బద్‌తో ఖుద్ కరే
లానత్ కరే సైతాన్ పర్’
(చేయాల్సిన తప్పులన్నీ చేసి, దెయ్యం చేయించిందంటూ తప్పించుకునేటోళ్లను చూస్తే నవ్వొస్తది)”
- కేసీఆర్ (ఇంకా…)
ఆంధ్రా ఉద్యోగులకు కౌన్సిలింగ్ – పాగల్ లొగొకొ కౌన్సిలింగ్ దేనాపడెగ జూన్ 19, 2007
Posted by ~Sri~ in Telangana.add a comment
”నిర్ణీత కోటాకు మించి హైదరాబాద్‌లో ఉన్న కోస్తా, రాయలసీమ ఉద్యోగులను సొంత జిల్లాలకు పంపొద్దు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో వీరిని నియమిస్తే అక్కడి నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి వీరందరినీ హైదరాబాద్‌లోనే ఉంచాలి. 610 జీవోపై జరిగే చర్చల్లో జనాభా ప్రాతిపదికన మూడింట రెండొంతుల మంది కోస్తా, రాయలసీమ ప్రతినిధులు ఉండాలి. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకే దీనిని అమలు చేయాలి. ఈ డిమాండ్లకు మద్దతుగా ఈనెల 25 నుంచి కోస్తా, సీమ జిల్లాల్లోని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహిస్తాం. కలెక్టర్లకు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతి పత్రాలు సమర్పిస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి మా ఆందోళనను తెలియజేస్తాం” అని ఏపీ ఎన్జీవో సంఘం నాయకులు ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లో సమావేశమై 610 జీవో అమలుపై చర్చించారు. ఈ సమావేశానికి సంఘం అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి అధ్యక్షత వహించగా.. ఇందు లో కాంగ్రెస్ నేతలు చేగొండి హరిరామజోగయ్య, వసంత నాగేశ్వరరావు, టీజీ వెంకటేష్, చదలవాడ కృష్ణమూర్తి, భాజపా నాయకుడు పార్థసారథి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రోశయ్య, వివిధ సంఘాల నేతలు కూడా పాల్గొన్నారు. సమావేశంతర్వాత విలేకరులతో మాట్లాడారు
(ఇంకా…)
చంద్రబాబు “ఊద్” ముబారక్ జూన్ 19, 2007
Posted by ~Sri~ in Telangana.add a comment
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే, ముఖ్యమంత్రి పదవిని దళితుడికి, ఉప ముఖ్యమంత్రి పదవిని ముస్లింకు ఇస్తామని తెరాస అధినేత కేసీఆర్ ప్రకటించారు. మంత్రివర్గంలో ఐదారుగురు ముస్లిం వర్గీయులకు అవకాశం కల్పిస్తామన్నారు. సోమవారం రాత్రి హైదరాబాద్ పాతబస్తీ కిషన్‌బాగ్‌లో తెరాస కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ముస్లింలు అధిక సంఖ్యలో హాజరైన ఈ సభలో కేసీఆర్ ఉర్దూలో మాట్లాడారు.


